అమెజాన్ లో కొండపొలం

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వైష్ణవ్.. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఆయన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తొలి సినిమా ఉప్పెన రిలీజ్ కాకముందే తన నెక్స్ట్ సినిమా కొండపొలం కూడా పూర్తి చేశారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ సినిమాను విడుదల చేసింది. నల్లమల అటవీ ప్రాంతం నేపథ్యంలో సాగే కొండపొలం గొర్రెల కాపరులు, వారి పోరాటాల కథాంశంతో ఈసినిమా రూపొందింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా రూపోందించారు దర్శకుడు క్రిష్. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్‌గా ఓబులమ్మ అనే పాత్రను చేసింది.