హ్యాపీ బర్త్ డే సురేందర్ రెడ్డి

కమర్షియల్ సినిమా మేకింగ్ లో దర్శకుడు సురేందర్ రెడ్డిది సెపరేట్ స్టైల్ శైలి. తనదైన మేకింగ్‌తో ఆయన ఒక కొత్త పంథా సృష్టించిన ఆయన ‘అతనొక్కడే’, ‘కిక్’, ‘రేసుగుర్రం’ లాంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకున్నారు. అవి మాత్రమే కాక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేసిన సినిమా ‘ధృవ’, మెగా స్టార్ చిరంజీవితో సైరా లాంటి హిట్స్ సినిమాలు కూడా సొంతం చేసుకున్నాడు. ఆయన మంగళవారం పుట్టిన రోజు జరుపుకున్నారు. అతనొక్కడే సినిమాతో మెగాఫోన్ పట్టిన దర్శకుడు సురేందర్ రెడ్డి. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ అగ్రహీరోల తో సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని మాచినపల్లిలో జన్మించిన సురేందర్ రెడ్డి సినిమాల మీద ఆసక్తితో డిగ్రీకి మధ్యలో గుడ్ బై చెప్పేసి హైదరాబాద్ వచ్చాడు. అలా 2005లో కళ్యాణ్‌ రామ్ హీరోగా తెరకెక్కిన అతనొక్కడే సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన తర్వాత 2006లో ఎన్టీఆర్ హీరోగా అశోక్, 2007లో మహేశ్‌తో అతిథి, 2009లో రవితేజతో కిక్, 2011లో ఎన్టీఆర్‌తో ఊసరవెళ్లి, 2014లో అల్లు అర్జున్‌తో రేసుగుర్రం, 2015లో కిక్‌ 2, 2016లో ధృవ, 2018లో మెగాస్టార్‌తో సైరా నర్సింహారెడ్డి సినిమాలు తెరకెక్కించి తెలుగుసినీ దర్శకులలో తనకంటూ సెపరేట్ క్రేజ్ ఏర్పరచుకున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ అక్కినేని నటిస్తోన్న విషయం తెలిసిందే. ఏజెంట్ అనే పేరుతొ అఖిల్‌ సినిమాను తెరకెక్కిస్తున్న సురేందర్ రెడ్డి ఆ సినిమాతో హిట్ అందుకోవాలని ‘సంతోషం’ గ్రూప్ మనస్ఫూర్తిగా కొరుకుంటోంది.