అఖండ ఐదో రోజు కలెక్షన్స్..ఎంతో తెలుసా?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా బాక్సాఫీసు వద్ద స్వైర విహారం కొనసాగిస్తోంది. సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ లభించడంతో పాటు పోటీకి ఒక్క సినిమా కూడా లేకపోవడంతో అఖండ ప్రభంజనానికి అడ్డు లేకుండా పోతోంది. మొదటి రోజు భారీ ఎత్తున వసూళ్లు సాధించిన ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లో కూడా చెప్పుకోదగ్గ కలెక్షన్స్ సాధించింది అయితే ఐదో రోజు సోమవారం కావడంతో కలెక్షన్స్ డ్రాప్ ఉంటుందని భావించారు కానీ ఊహించిన దానికంటే కలెక్షన్స్ ఎక్కువ రావడం ఆసక్తికరంగా మారింది.. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే గనుక 41 కోట్ల 14 లక్షల రూపాయల షేర్ వసూలు సాధించింది, అలాగే 64 కోట్ల 80 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది ఈ సినిమా. ఇక 5వ రోజు ప్రాంతాల వారీగా కలెక్షన్స్ ఈ మేరకు ఉన్నాయి. నైజాంలో కోటి 31 లక్షలు, సీడెడ ప్రాంతంలో 91 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 38 లక్షలు, తూర్పు గోదావరి జిల్లా 21 లక్షలు, పశ్చిమగోదావరి జిల్లా 18 లక్షలు, గుంటూరు జిల్లా 24 లక్షలు, కృష్ణాజిల్లా 23 లక్షలు, నెల్లూరు జిల్లా 12 లక్షలు మొత్తం మూడు కోట్ల 58 లక్షలు షేర్ వసూలు సాధించగా 5 కోట్ల 70 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక ఐదు రోజులకుగాను కర్ణాటక సహా మిగతా భారతదేశం మొత్తం మీద మూడు కోట్ల యాభై రెండు లక్షలు వసూలు సాధించగా ఓవర్సీస్లో ఇప్పటిదాకా నాలుగు కోట్ల 38 లక్షలు వసూలు సాధించింది. ఇక ఐదు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 49 కోట్ల నాలుగు లక్షలు షేర్ సాధించింది ఈ సినిమా. మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ 53 కోట్లు కావడంతో 54 కోట్ల రూపాయలు వసూలు సాధిస్తే బ్రేక్ ఈవెన్ సాధించినట్లే. ఇక ప్రస్తుతం ఉన్న వసూళ్ళ ప్రకారం ఇంకా నాలుగు కోట్ల 96 లక్షల రూపాయలు సాధిస్తే ఈ సినిమా ప్యూర్ హిట్ స్టేటస్ సాధించినట్లే. మళ్లీ శుక్రవారం దాకా ఎలాంటి సినిమాలు లేకపోవడంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం అనేది చాలా చిన్న విషయాన్ని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.