‘ఆశ ఒక శక్తివంతమైన భావోద్వేగం’

సౌత్ లో చిత్ర పరిశ్రమలో నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవికున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ భామ చెల్లెలు పూజా కన్నన్‌ కూడా ఆమె బాటలోనే నడుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘చిత్తారాయి సెవ్వనం’ శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తన చెల్లెలి సినిమా గురించి చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌ పెట్టిన సాయి పల్లవి ఆ తరువాత మరో ఆసక్తికర ఫోటో పంచుకుంది. ‘ఆశ ఒక శక్తివంతమైన భావోద్వేగం’ అంటూ హీరోయిన్ సాయిపల్లవి ఓ ఫోటో పంచుకుంది. సాయిపల్లవి ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో లుక్ ను సాయిపల్లవి తాజాగా పంచుకుంది. ఆ లుక్ లో సాయిపల్లవి హిందూ సాంప్రదాయం ప్రకారం నుదుట బొట్టు, ముక్కు పుడక పెట్టుకొని కనిపించింది. నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ అయింది. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.