లిజో జోస్ పెల్లిసెరి- మమ్ముట్టి సినిమాలో రమ్య పాండియన్ !

తమిళ నటి రమ్య పాండియన్ దర్శకుడు మలయాళ దర్శకుడు లిజో జోస్ పెల్లిసెరి- మమ్ముట్టి సినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఆమె సినిమా సెట్స్‌లో కనిపించడంతో ఆమె నటించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు నటి స్వయంగా ‘నన్‌పకల్ నేరతు మయక్కమ్’ అనే చిత్రంలో తాను భాగం అవుతున్నానని అధికారికంగా ప్రకటించింది. ఇక మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, దర్శకుడు లిజో జోస్ పెల్లిసెరి మరియు సినిమాటోగ్రాఫర్ తేనీశ్వర్‌తో కలిసి దిగిన తన ఫోటోలు పంచుకుంటూ నటి రమ్య పాండియన్ ఇలా రాసుకొచ్చింది, “నా తదుపరి ప్రాజెక్ట్ మలయాళంలో ఉందని అధికారికంగా ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను. విమర్శకుల ప్రశంసలు పొందిన, అత్యంత ప్రభావవంతమైన దర్శకుడు లిజో జోస్ సర్ మరియు మెగాస్టార్ మమ్ముట్టి సర్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం ఒక కల నిజమైనట్టే అనిపిస్తోంది. తేనీశ్వర్ సార్ వారి టీమ్ కు ధన్యవాదాలు అని ఆమె పేర్కొంది. ఇక రమ్య పాండియన్ ‘జోకర్’, ‘రామే అందాలు రావణే అందాలు’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.