‘పుష్ప’ ట్రైలర్ రిలీజ్

అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ప ది రైజ్’. శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్ర చందనం చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ట్రైలర్ ని డిసెంబర్ 6 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అందరు ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్న క్షణంలో మేకర్స్ షాక్ ఇస్తూ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ట్రైలర్ వాయిదా పడుతున్నట్లు తెలిపారు. ట్రైలర్ రిలీజ్ చేయడం ఆలస్యమైనందుకు క్షమాపణలు కోరిన మేకర్స్ త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తామని తెలిపారు. దాదాపు మూడు గంటలు ఆలస్యంగా విడుదల చేశారు మేకర్స్. తొలుత లేట్ చేసినందుకు ఫ్యాన్స్ మైత్రీ మూవీ మేకర్స్ పై మండిపడిన ఫాన్స్ కూడా ట్రైలర్ కట్ చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో షాట్ పిచ్చెక్కించే విధంగా, సుకుమార్ మార్క్ తో ట్రైలర్ ఉంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా విలన్ గా మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని ఈ సినిమాపై భారీ అంచలనాలను రేకెత్తిస్తున్నాయి.