అఖండ సినీ పరిశ్రమకి ఊపిరి పోసింది!

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ డిసెంబ‌ర్ 2న విడుద‌లై ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమాతో మ‌ళ్లీ టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి నూతనోత్సం వచ్చినట్టయింది. దీంతో సినిమా మీద ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మ‌హేష్ బాబు, ఎన్ఠీఆర్, కళ్యాణ్ రామ్, రామ్, అనీల్ రావిపూడి, వంటి వారు మూవీపై ప్ర‌శంస‌లు కురిపించ‌గా, ఇప్ప‌డు మోహ‌న్ బాబు..అఖండ‌ సినీ పరిశ్రమకి ఊపిరి పోసింది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ”సినిమా థియేటర్ కి ప్రేక్షకులు రారు, చూడరు అనుకుంటున్న క్లిష్ట పరిస్థితుల్లో అఖండ “అఖండ” సినిమా విజ‌యం, సినీ పరిశ్రమకి ఊపిరి పోసింది. విడుదలకు సిద్ధంగా ఉన్న చాలా సినిమాలకు ధైర్యాన్నిచ్చింది. నా సోదరుడు బాలయ్యకి, టీంకి శుభాకాంక్షలు,” అని మంచు మోహన్ బాబు పేర్కొన్నారు. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్’ షోకి మొదటి గెస్టులు కూడా మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి ప్రసన్నలు పాల్గొన్నారు.