మెగాస్టార్ చిరంజీవి వరల్డ్ రికార్డ్

1 5

ఒకప్పుడు మూడు షిఫ్టులు పని చేసి ఏడాదికి ఎన్ని సినిమాలు విడుదలైతే అన్ని సినిమాలు విడుదల చేసిన ఘన చరిత్ర మన మెగాస్టార్‌ చిరంజీవి సొంతం. అయితే ఇప్పుడు ఒకే నెలలో నాలుగు సినిమా చేస్తూ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు మెగాస్టార్.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’, మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’, మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళాశంకర్’, అలాగే బాబీ దర్శకత్వంలో చిరు 154 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న చిత్రంలోనూ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. డిసెంబర్‌లో నాలుగు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటూ.. మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ మెగా ఫీట్‌ను మెగాభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. చిరు 152, చిరు 153, చిరు 154, చిరు 155 చిత్రాల్లోని ప్రీలుక్స్‌ను కలిపి ఒక పోస్టర్‌లా డిజైన్ చేసి షేర్ చేసుకుంటున్నారు. వరుసగా నాలుగు సినిమాలతో ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్‌కు మెగాస్టార్ చిరంజీవి పని కల్పిస్తున్నారని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నాలుగు చిత్రాల్లో కొరటాల దర్శకత్వం వహిం‍చిన ‘ఆచార్య’ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. అలాగే సమ్మర్‌లో ‘గాడ్ ఫాదర్’ విడుదలకు ముస్తాబవుతోంది. అదే స్పీడ్‌లో భోళాశంకర్, బాబి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రాన్ని కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇక చేతిలో ఉన్న నాలుగు చిత్రాలు కాకుండా మరో రెండు సినిమాలు త్వరలో అనౌన్స్ చేసేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నారు మెగాస్టార్ చిరంజీవి. అలాగే మరో రెండు నిర్మాణ సంస్థలు కూడా మెగాస్టార్ డేట్స్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయట. దర్శకుల పేర్లు ఖరారు అవ్వగానే ఆ ప్రాజెక్ట్స్ కూడా మెగాస్టార్ లిస్ట్‌లో చేరనున్నాయి. మొత్తంగా 2022 నుంచి మళ్లీ మెగా సందడి మొదలు కాబోతోంది. మెగా స్టార్ ఇదే స్పీడ్ కొనసాగిస్తే, ఏడాదికి నాలుగైదు చిత్రాలు విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో మెగాభిమానులకు ఏడాదంతా పండగ వాతావరణం రానుంది.