‘ఖిలాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్

6 8

మాస్ మహారాజా రవితేజ, రమేశ్ వర్మ కలయికలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఖిలాడి’. రెండు వైవిధ్యమైన పాత్రలతో రవితేజ డ్యూయల్ రోల్స్ సినిమాకి హైలైట్స్ కానున్నాయి. యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మాణంలో రూపొందుతున్న ఈసినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇంతకు ముందు ‘ఖిలాడి’ టీజర్ తో పాటు విడుదలైన సింగిల్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను ఇంకా ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఖిలాడి సినిమా విడుదల తేదీని ట్విట్టర్ వేదికగా గురువారం ప్రకటించారు మేకర్స్. రవితేజ స్టైల్ గా స్మోక్ చేస్తున్న లుక్ ను ఈ సందర్బంగా విడుదల చేశారు. ఫిబ్రవరి 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. అనసూయ, ఉన్నిముకుందన్, నిఖితిన్ ధీర్, ఠాగూర్ అనూప్ సింగ్, వెన్నెల కిశోర్, రావురమేశ్, ముఖేష్ రుషి, సచిన్ ఖేడ్కర్ , మురళి శర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. శ్రీకాంత్ విస్సా, దేవీశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ డైలాగ్స్ రాశారు. సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో క్రాక్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ‘ఖిలాడీ’ తో కూడా సూపర్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.