అలాంటి పాత్రలు వస్తే చేస్తా : హీరోయిన్ మెహరీన్

mehrin

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది మెహ్రిన్. ముక్యంగా ఎఫ్ 2 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెహ్రిన్ వరుస సినిమాలతో తెలుగులో బిజీగా మారింది. ఆమె తాజాగా సంతోష్ శోభన్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. మహానుభావుడు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా“మంచి రోజులు వచ్చాయి”. టాక్సీవాలా తర్వాత ఎస్ కే ఎన్ నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన సందర్భంగా హీరోయిన్ మెహ్రీన్ తో చిట్ చాట్

@ కనెక్ట్ అయిన సినిమా..

యువి క్రియేషన్స్, యస్.కె.యన్, మారుతీ గార్ల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది ఇది చాలా మంచి సబ్జెక్టు. నా లైఫ్ లో కనెక్ట్ అయిన ఫస్ట్ మూవీ ఇది.ఇంత మంచి టీం తో చాలా ఎంజాయ్ చేస్తూ..వర్క్ చేయడం జరిగింది. ఈ సినిమాలో పద్దు క్యారెక్టర్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పాత్ర చేస్తున్నాను. ఇది ఒక కాలనీలో జరిగే కథ ఇది.ఇలాంటి కథలు ప్రతి ఇంట్లో జరుగుతుంటాయి.అలాంటి స్టోరీని కథగా తీసుకొని ఎంటర్టైన్మెంట్ రూపకంగా ప్రేక్షకులకు చూపించడం జరుగుతుంది. ఈ సినిమాలో మేము చూయించిన సీన్స్, స్విచ్వేషన్స్ కోవిడ్ టైం లో చాలా మందికి జరిగాయి. అలాగే నేను చేసిన F2, F3 సినిమాలలో చేసిన పాత్రలకంటే ఇందులో నేను చేస్తున్న పాత్ర డిఫరెంట్. నేను నార్మల్గానే చాలా ఫన్నీగా ఉంటాను. అందువల్ల నేను చేసే క్యారెక్టర్స్ లలో అల్లరి అయినా, కామెడీ అయినా చేయడం నాకు చాలా ఈజీ అనిపిస్తుంది.

@ అలాంటి పాత్రలు …

సంతోష్ నటన పరంగా చాలా బాగా పెర్ఫార్మన్స్ చేశాడు. ఈ క్యారెక్టర్ పరంగా నాకే డౌట్ ఉన్న మారుతి గారి దగ్గరికెళ్లి సలహాలు తీసుకున్నాను. అందువల్ల నేను చాలా ఈజీ చేయగలిగేదాన్ని కృష్ణ గాడి వీర ప్రేమ గాథ లాంటి సినిమా తర్వాత ఇందులో నాకు ఇది మంచి రోల్ ఇచ్చారు. నేను చేసే ప్రతి సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమీ ఉండదు నాకు అవకాశం వచ్చిన సినిమాలన్నీ పెద్ద సినిమాలుగానే భావిస్తాను. కోవిడ్ టైంలో కూడా కోవిడ్ ప్రికాషన్స్ పాటిస్తూ మేము సినిమా షూట్ చేయడం జరిగింది. అలాగే కోవిడ్ కారణంగా చాలా మంది హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడ్డారు. అందులో నేను కూడా వున్నాను. నాకు మా మదర్ కి కోవిడ్ వచ్చింది. వన్ మంత్ తర్వాత మేము రికవరీ అయ్యాము. ఇక నా గురించి సోషల్ మీడియా లో వచ్చే కామెంట్స్ ను పాజిటివ్ అయినా నెగటివ్ అయినా ఈక్వల్ గా తీసుకుంటాను. మహానటి లో చేసిన కీర్తి సురేష్ క్యారెక్టర్ ,ఓ బేబీ సినిమాలో సమంత చేసిన క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం.ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే నాకు చేయాలని ఉంది. ప్రస్తుతం కన్నడలో శివరాజ్ గారితో ఒక సినిమా చేస్తున్నాను. తర్వాత వేరే సినిమాలు ఉన్నాయి. తెలుగులో కూడా కొన్ని స్టోరీస్ వింటున్నాను.