జయంతి సందర్బంగా వంగవీటి రంగ ఫోస్టర్ విడుదల?

vangaveeti 44 1

వంగవీటి, దేవినేని కుటుంబాల కథతో ప్రముఖ దర్శకుడు నర్రా శివ నాగేశ్వర రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవినేని. నేడు వంగవీటి రంగ పుట్టిన రోజు సందర్బంగా అయన పాత్రలో నటిస్తున్న నటులు సురేష్ కొండేటి పోస్టర్స్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది ? వంగవీటి రంగ లుక్ లో సురేష్ కొండేటి అదరగొట్టే లుక్ తో ఉన్నారంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రేండింగ్ అవుతుంది !!
నందమూరి తారకరత్న హీరోగా వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, కెఎస్ వ్యాస్ పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటీ,నటులుగా నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) ద‌ర్శ‌క‌త్వంలో జిఎస్ఆర్, రాము రాథోడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దేవినేని’ (బెజవాడ సింహం) అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రం ప్రమోషల్ సాంగ్ ను ఇటీవలే విడుదల చేసారు. తాజాగా ఆదివారం వంగవీటి రంగ పుట్టిన రోజు పురస్కరించుకుని ఆయనకు సంబందించిన పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. వంగవీటి రంగ పాత్రలో సురేష్ కొండేటి నటిస్తున్నారు.