ఉప్పెన హీరోయిన్ కు భారీ గిఫ్ట్ ?

uppena heroyen

ఒక సినిమా హిట్ అయిందంటే .. ఆ నిర్మాతలో, లేదా హీరోనో దర్శకుడికి గిఫ్ట్ ఇస్తుంటారన్న విషయం చాలా సార్లు చూసాం. ఈ మధ్య ఎక్కవు ఆ హీరోయిన్‌కి కారు కొనిచ్చార‌ట, ఈ హీరోయిన్‌కి ఫ‌లానా వ్య‌క్తి ఫ్లాట్ కొనిచ్చార‌ట అనే గాసిప్స్ కి హ‌ద్దే ఉండ‌దు. అయితే ఇవ‌న్నీ పేరు మోసిన హీరోయిన్ల విష‌యంలో వినిపిస్తూ ఉంటాయి. ఈ హీరోయిన్ విష‌యంలోనూ ఇప్పుడు ఇలాంటి న్యూస్ వైర‌ల్ అవుతోంది. ఆమెకు ఏకంగా పాతిక ల‌క్ష‌లు ఇచ్చేశార‌నే న్యూస్ బ‌య‌టికొచ్చింది. ఇంత‌కీ అంత క్రేజీ తెచ్చుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా .. కృతి శెట్టి !! ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడికి పాతిక ల‌క్ష‌లు ఇచ్చార‌ట‌. అది కూడా ఎవరో కాదు మైత్రీ మూవీ మేక‌ర్స్ వాళ్లే. ఉప్పెన సినిమా వంద కోట్ల మార్కు దగ్గరికి రావడంతో ఈ సినిమా హీరో, హీరోయిన్ ల రెమ్యూనరేషన్ కూడా డాబు డబుల్ చేసి ఇచ్చారట ? ఈ సినిమాకు డెబ్యూ హీరోయిన్ అయినా కృతికి ముందు రూ.10ల‌క్ష‌లు ఇచ్చార‌ట‌. ఇప్పుడు స‌క్సెస్ కావ‌డంతో ఇంకో పాతిక ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్కును ఇచ్చార‌ట‌.అది విషయం !!