
రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా వచ్చిన ‘మర్యాద రామన్న’ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు అదే టైటిల్‌ను గుర్తుకు తెచ్చేలా సునీల్ ‘మర్యాద కృష్ణయ్య’ అనే చిత్రం చేయబోతున్నారు. సునీల్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించి, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. వి. ఎన్. ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇతర వివరాలు ప్రకటించాల్సి ఉంది.