
సౌత్ గ్లామర్ భామ శృతి హాసన్ మళ్ళీ ప్రేమలో పడ్డట్టుంది అన్న సంగతి ఈ మద్యే ఆమె పుట్టిన రోజు సందర్బంగా బయటపడింది. గత రెండేళ్ల క్రితం కూడా ఓ వ్యక్తి ప్రేమయంలో పీకలదాకా మునిగి.. ఆపై తేరుకుని మళ్ళీ సినిమాలు చేస్తున్న శృతి హాసన్ ని మళ్ళీ ముగ్గులోకి దింపాడు ఓ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ ? ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శాంతను.. వృత్తిపరంగా తాము మంచి స్నేహితులమని, తామిద్దరికి పలు అభిప్రాయాలు కలిశాయని, వ్యక్తిగత విషయాలపై తాను మాట్లాడుకోవాలనుకోవడం లేదని అన్నాడు. అయితే బయటకు అలా చెప్పినప్పటికీ.. శాంతను, శ్రుతీతో డీప్ ప్రేమలో పడ్డట్లు టాక్. ఈ క్రమంలో తాజాగా ఆమె కోసం చెన్నై వచ్చేశాడు శాంతను.
ఆ ఫొటోలను శ్రుతీనే తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. చెన్నై చిల్లింగ్ సీన్స్ అంటూ కామెంట్ పెట్టారు. ఇక ఆ ఫొటోల్లో ఆ ఇద్దరు చాలా క్లోజ్‌గా ఉన్నారు. అయితే ఆ మధ్యన శ్రుతీ, శాంతనుతో పలుమార్లు ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన విషయం తెలిసిందే. కాగా ఈ ఏడాది క్రాక్‌తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు శ్రుతీ హాసన్. రవితేజ నటించిన క్రాక్ చిత్రం సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కాగా.. బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.