శ్రీరామ్ – రాహుల్ రామకృష్ణల Y మోషన్ పోస్టర్ విడుదల

y movie

శ్రీరామ్, రాహుల్ రామకృష్ణ, అక్షయ చందర్ ప్రధాన పాత్రలో బాలు అడుసుమిల్లి తెరకెక్కిస్తున్న విలక్షణ చిత్రం Y. ఏరుకొండ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో జక్కంపూడి గణేష్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. యేరుకొండ రఘురాం, శ్రీనివాస్ వేగి, మురళి మాటూరు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు బాలు. తెలుగు మోషన్ పోస్టర్ వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నిర్మాత బన్నీ వాసు విడుదల చేశారు. తమిళ మోషన్ పోస్టర్ ప్రముఖ హీరో ఆర్య విడుదల చేశారు.

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ‘Y’ మోషన్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉందని.. సినిమా ఇంకా ఆసక్తికరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ చెప్పారు నిర్మాత బన్నీ వాసు. రెండు భాషల్లోనూ ఈ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు.

చోటా కె ప్రసాద్ ఈ సినిమాకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దర్శన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. వికాస్ బడిస సంగీతం సమకూరుస్తున్నారు. Y చిత్రానికి వినయ్ కొట్టి మాటలు రాస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు.

నటీనటులు:

శ్రీరామ్, రాహుల్ రామకృష్ణ, అక్షయ చందర్, టిఎన్ఆర్, జెమిని సురేష్, రఘు బాబు, కత్తి మహేష్..

టెక్నికల్ టీం:

రచన – దర్శకత్వం: బాలు అడుసుమిల్లి
నిర్మాతలు: యేరుకొండ రఘురాం, శ్రీనివాస్ వేగి, మురళి మాటూరు
బ్యానర్: యేరుకొండ ఎంటర్టైన్మెంట్
సమర్పణ: జక్కంపూడి గణేష్
ఎడిటర్: చోటా కె ప్రసాద్
సంగీతం: వికాస్ బడిస
సినిమాటోగ్రఫీ: దర్శన్
PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్