అపరిచితుడు సీక్వెల్‌ బాలీవుడ్‌ హీరో ఆసక్తి

ranveer singh

15 ఏళ్ల క్రితం విక్రమ్‌ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించిన చిత్రం ‘అపరిచితుడు’. ఈ సినిమాతో విక్రమ్‌కు స్టార్‌ హీరోగా, విలక్షణ నటుడుగా పేరు తెచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్‌ తీయాలని శంకర్‌ చాలాకాలంగా అనుకుంటున్నారు. అపరిచితుడు సీక్వెల్‌లో నటించడానికి బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌సింగ్‌ ఆసక్తి చూపుతున్నారని సమాచారం. రణ్‌వీర్‌ శంకర్‌ను కలసి ఈ సినిమా సీక్వెల్‌ తీయాలని కోరారట. అయితే ఇప్పుడు రామ్‌చరణ్‌ చిత్రంతో శంకర్‌ బిజీగా ఉన్నారు. దాంతో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.