బాలీవుడ్ మెగాస్టార్ కు ఆపరేషన్ ?

amithab

బాలీవుడ్ మెగాస్టార్ ఆపరేషన్ చేయించుకోబోతున్నారట. ఆ సంగతిని అమితాబే స్వయంగా తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు. అయితే అమితాబ్ ఎందుకు శస్త్ర చికిత్స చేయించుకోబోతున్నారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.  అయితే అమితాబ్‌ సర్జరీ గురించి తెలిసిన ఆయన అభిమానులు టెన్షన్‌ పడుతున్నారు. అసలు అమితాబ్‌కు ఏమైందనే ఆలోచనలతో వారు, శస్త్రచికిత్స విజయవంతం కావాలని ప్రార్థనలు చేస్తున్నామని ట్వీట్స్‌ చేస్తున్నారు. 1982లో కూలీ సినిమా షూటింగ్‌లో గాయపడ్డప్పుడు అమితాబ్‌కు శస్త్ర చికిత్స జరిగింది. ఆ తర్వాత 2005లో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డప్పుడు శస్త్ర చికిత్స జరిగింది.