మరో బాలీవుడ్ ఛాన్స్ పట్టేసిన నాగార్జున ?

nag

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమాలు ఈ మధ్య కాస్త తెలుగులో తగ్గాయి. అయితే అయనకు లేటెస్ట్ గా బాలీవుడ్ నుండి ఎక్కువ ఆఫర్స్ వస్తుండడంతో తెలుగులో తగ్గించారని టాక్, ఇప్పటికే బ్రహ్మాస్త్ర సినిమాలో నాగార్జున కు తాజగా మరో హిందీ సినిమా ఛాన్స్ వచ్చిందతని సమాచారం ? నాగార్జున ప్రస్తుతం తెలుగులో వైల్డ్ డాగ్, బంగార్రాజు సినిమాలు చేస్తున్నాడు. దాంతో పాటు అటు బాలీవుడ్ లో ‘బ్రహ్మాస్త్ర’ అనే భారీ సినిమాలో కీ రోల్ పోషిస్తున్నారు. ఈ మధ్యనే ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటోన్న ఈ పాన్ ఇండియా సినిమా బహుభాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల కాకముందే నాగార్జున కు మరో బాలీవుడ్ సినిమా ఆఫర్ వచ్చిందట ? అయితే ఇందులో ఆయన పాత్ర కాస్త నెగెటివ్ టచ్ తో ఉంటుందని సమాచారం. రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడట. సో త్వరలోనే అధికారిక వివరాలు వెల్లడి కానున్నాయి !!