బాలీవుడ్ లోకి నాంది సినిమా ?

naandi remeke

అల్లరి నరేష్ హీరోగా నటించిన నాంది ఇటీవలే విడుదలై సూపర్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తరువాత అల్లరి నరేష్ కి మంచి హిట్ దక్కింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఈ మద్యే టీం ని అభినందించిన అయన నాంది సినిమాను హిందీ తో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

కామెడీ చిత్రాలకు బిన్నంగా అల్లరి నరేష్ బిన్నైమైన పాత్రలతో నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. అలాంటి మరో భిన్నమైన సినిమా నాంది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు బోక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను ముందు హిందీలో రీమేక్ చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం నానీ నటించిన జెర్సీ సినిమాను హిందీలో నిర్మిస్తోన్న ఆయన , నాంది రీమేక్ రైట్స్ తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాను తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు.. హిందీలోకి కూడా తీసుకెళ్ళ ప్రయత్నాల్లో దిల్ రాజు ఉన్నారని టాక్.