విలన్‌గా రెడీ అంటున్న స్టార్‌ హీరోయిన్‌

laavanya thriphati

ప్రస్తుతం కొంతమంది కథానాయికలు హీరోయిన్లుగా చేస్తూనే విలన్‌ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. రెజీనా కసాండ్రా ‘చక్ర’ సినిమాతో, సమంత ‘ద ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌సిరీస్‌తో ఆ దిశగా ముందడుగు వేశారు. తాజాగా లావణ్యా త్రిపాఠి కూడా లేడీ విలన్‌ పాత్రలపై ఆసక్తి కనబరుస్తున్నారని తెలిసింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లావణ్య మాట్లాడుతూ విలన్‌ పాత్రలతో మనలోని ప్రతిభ బయటకు వస్తుందని, నెగటివ్‌ రోల్స్‌ చేయడానికి ఆసక్తిగా ఉన్నానని చెప్పారు.