
సుమ కనకాల.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో పాటు బుల్లితెర కార్యక్రమాలతో బిజిగా ఉంటుందీ స్టార్ యాంకర్. ప్రోగ్రామ్స్‌కు భారీ రెమ్యునరేషన్ తీసుకునే సుమ, అడపాదడపా సినిమాల్లో నటిస్తుంటుంది. లేటెస్ట్ సమాచారం మేరకు సుమ.. చాలా రోజుల తర్వాత ఓ సినిమాలో కనిపించనుంది. అది కూడా ఓ డిఫరెంట్ పాత్రలో. ఇంతకీ సుమ కనకాల నటించిన చిత్రమేదో తెలుసా ఏ1 ఎక్స్‌ప్రెస్
. ఈ సినిమాలో సుమ కామేంటేటర్ పాత్రలో కనిపించనుందట. హాకీ నేపథ్యంలో సాగే ఏ1 ఎక్స్‌ప్రెస్
సినిమాలో సెకండాఫ్‌లో ఓ హాకీ మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్స్ అవసరం అయ్యారు. కాస్త పాపులర్ ఫేసులైతే బావుంటుందని భావించిన మేకర్స్ సుమ కనకాలతో పాటు వైవా హర్షలను కామేంటేటర్స్ నటింప చేశారట. మార్చి 5న ఏ 1 ఎక్స్‌ప్రెస్ విడుదలవుతుంది.