అందుకే విడాకులు తీసుకున్న హీరోయిన్‌

amala paul

దక్షిణాదిన హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అమలాపాల్‌. అయితే ఆమె వివాహం జీవితం మాత్రం సాఫీగా సాగలేదు. దర్శకుడు ఏ ఎల్‌ విజయ్‌ను వివాహం చేసుకొని విడాకులు తీసుకున్నారు. అయితే ఎందుకు విడాకులు తీసుకున్నారో ఎవరికీ తెలియదు. ఇటీవల ఆమె నటించిన పిట్టకథలు వెబ్‌చిత్ర ం ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విడాకుల విషయాన్ని ప్రస్తావించారు. భర్తతో విభేదాల వల్లే విడిపోయానని భర్త కుటుంబసభ్యులు తనను భయపెట్టారని చెప్పారు. ఆ సమయంలో తనకు ఎవరూ అండగా నిలబడలేదని, తన బాధను గురించి పట్టించుకోలేదని చెప్పారు.