మొక్కలు నాటిన నటుడు విజయ్ భాస్కర్

green india

“బతుకమ్మ, సిక్స్ టీన్స్, మనసుతో” చిత్రాల కథానాయకుడు విజయ్ భాస్కర్ మేడ్చల్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో శనివారం మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు… కేసీఆర్ కోసం కోటి వృక్షార్చనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు విజయ్ భాస్కర్ తెలిపారు. విజయ్ భాస్కర్ తోపాటు… ఈ కార్యక్రమంలో జబర్దస్త్ నవీన్, నిర్మాత రాజేష్ నాగుల పాల్గొన్నారు!!