రష్మిక అవకాశం పూజాకు

pooja heghdey

తమిళంలో మంచి ఫ్యాన్‌ బేస్‌ ఉన్న హీరో విజయ్‌. రజనీకాంత తర్వాత తమిళ సినీరంగాన్ని ఏలుతున్నాడు. అందుకే విజయ్‌ సరసన అవకాశం వస్తే ఏ హీరోయిన్‌ వదులుకోదు. కానీ విజయ్‌ 65వ చిత్రంలో కథానాయికగా రష్మిక మందన్నకు అవకాశం వస్తే వదులుకున్నారని ఆ అవకాశం ఇప్పుడు పూజాహెగ్డేకు దక్కిందనేది కోలీవుడ్‌ టాక్‌. బాలీవుడ్‌లో ‘మిషన్‌ మజ్ను’, ‘డెడ్లీ’ చిత్రాలతో రష్మిక బిజీగా ఉండడంతో విజయ్‌ చిత్రానికి డేట్లు అడ్జెస్ట్‌ చేయలేకపోయిందట. దాంతో పూజాహెగ్డేను హీరోయిన్‌గా తీసుకోవడం దాదాపుగా ఖరారైందని సమాచారం. పూజా కూడా ఈ అవకాశాన్ని వదులుకోవడం ఇష్టంలేక వెంటనే అంగీకరించిందట.