యూత్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు -మిస్టర్ & మిస్ హీరో శైలేష్ సన్నీ

mr and miss

జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా అశోకరెడ్డి దర్శకత్వంలో వస్తున్న క్రౌడ్ ఫండెడ్ చిత్రం మిస్టర్ & మిస్. రీడింగ్ ల్యాంప్స్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మిస్టర్ అండ్ మిస్ సినిమా ఈనెల 29న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరో శైలేష్ సన్నీ చిత్ర విశేషాలు తెలిపారు.

@ నాకు చిన్నప్పటినుంచి సినిమాలు, యాక్టింగ్ తో ఇష్టం. బీటెక్ పూర్తి చేసుకుంటూ షాట్ ఫిల్మ్ లలో లో ట్రై చేసేవాన్ని…కాలేజీలో జరిగిన ఒక వేడుకలో చిన్న షాట్ ఫిల్మ్ చేశాను. అది చూసి చాలా మంది బాగా నటించావు అన్నారు. దాంతో నటింగలను అనే ఉత్సాహం వచ్చింది. షాట్ ఫిలిమ్స్ లో నటిస్తూ ఫైనాన్స్ సపోర్ట్ కోసం విప్రో లో జాబ్ చేశాను.

@ షార్ట్ ఫిల్మ్ లు చేస్తున్న క్రమంలోనే అశోక్ రెడ్డి దర్శకత్వంలో మిస్టర్ అండ్ మిస్ 30 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిలింలో నటించే అవకాశం వచ్చింది. మిస్టర్ అండ్ మిస్ షార్ట్ ఫిలింనే ఎలాబ్రేట్ చేసి సినిమాగా తెరకెక్కించాం. ఇందులో స్క్రీన్ ప్లే, ట్విస్ట్ టర్న్స్ వేరే ఉంటాయి. హీరో హీరోయిన్ ల దగ్గర నుంచి మిస్ అయిన ఫోన్ దొరికిందా లేదా.. దొరికితే ఎలా దొరికింది.. ఫోన్ లో ఏముంది వారిద్దరూ కలిశారా.. అనే కథాంశంతో ఈ మూవీ సాగుతుంది.

@ ఈ సినిమా లో నేను శివ క్యారెక్టర్ గా విలేజ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన అబ్బాయిగా నటించాను.హీరోయిన్ జ్ఞానేశ్వరి ముంబై నుండి వచ్చిన ఫ్యాషన్ గర్ల్ లా నటించింది.అయితే మేమిద్దరం ఇంతకుముందు చేసిన మిస్టర్ అండ్ మిసెస్ డెమో షార్ట్ షార్ట్ ఫిలిం లో వర్క్ చేశాము. హీరోయిన్ తో నాకు నాలుగు సంవత్సరాల నుంచి పరిచయం ఉంది.

@ మా డైరెక్టర్ ఫ్రెండ్ ఫోన్ పోయినప్పుడు వారు ఎంత ఇబ్బంది పడ్డారో డైరెక్టర్ గారు చూశారు. దాన్ని సీరియస్ టాపిక్ గా తీసుకుని కమర్షియల్ వే లో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ కల్పిస్తూ మూవీ ఎందుకు చేయకూడదనే ఐడియా తో ఈ ప్లాట్ ఫర్మ్ ని ఎంచుకోవడం జరిగింది.ముక్యంగా యస్వంత్ నాగ్ ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలుస్తుంది.

@ ఈ సినిమాలోని పాటలకు యూత్ అంతా కనెక్ట్ అవుతారు. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.నాకు ఈ సినిమాలో అన్ని పాటలు నచ్చాయి అందులో “ఎం మనసే” పాట నా ఫెవరేట్ సాంగ్. చాలా మంది బ్రేకప్ అయిన లవర్స్ కు మా సినిమా కంపల్సరీ కనెక్ట్ అవుతుంది.

@ మేము తీసిన చిన్న షార్ట్ ఫిలిం మిస్టర్ అండ్ మిస్ చేసిన సేమ్ క్యాస్ట్ అండ్ క్రూనే ఈ మూవీ కు చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ సిద్ధం మనోహర్ గారు వైజయంతి మూవీస్ లకు చేస్తుంటాడు. అలాంటి వ్యక్తి మా మూవీ కి చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా మొత్తానికి బ్యాక్ బోన్ అశోక్ రెడ్డి గారే. ప్రేక్షకుడు రెండు గంటల కూర్చొని ఎలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడో అంత ఎంటర్ టైన్మెంట్ మా మిస్టర్ & మిస్సెస్ ఇస్తుందనే నమ్మకం ఉంది.

@ ఇంతకుముందు మేము తీసిన షార్ట్ ఫిలింలో ఓన్లీ ప్రాబ్లమ్స్ గురించే చెప్పాము. ఇందులో వారు ఎలా కలిశారు ఫోన్ ఎలా దొరికిందో తెలియజేస్తూ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో ఈ మూవీ చేయడం జరిగింది. ఈ మూవీను చూసిన యూత్ కనెక్ట్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. చూసిన పేరెంట్స్ కూడా మీరు చెప్పిన పాయింట్స్ కరెక్ట్ గా ఉందని నమ్ముతారు.

@ నా నెక్స్ట్ ప్రాజెక్ట్ రెండు సినిమా కథలు విన్నాను అవి ఇంకా ప్రోగ్రస్ లో ఉన్నాయి. త్వరలో తెలియజేస్తాను. అలాగే మార్చి లో రెండు ఓటిటి. మూవీస్ స్టార్ట్ అవుతాయి.ఈ నెల 29న విడుదల అవుతున్న మా మిస్టర్ అండ్ మిస్ ను చూసి ప్రేక్షకులు అందరూ ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరు కోరుకుంటున్నాను. అన్నారు.

sailesh